Shiva kumar: వైసీపీ బహిష్కృత నేత శివకుమార్ ఎన్నికల సర్వే ఫలితాల విడుదల
- రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడమే మైనస్
- పథకాలన్నీ ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నాయి
- ప్రజాకూటమికి 53 సీట్లు, టీఆర్ఎస్‌కి 41 సీట్లు
ఈసారి తెలంగాణ ఎన్నికలు నువ్వా.. నేనా? అన్నట్టుగా జరిగాయి. ప్రజాకూటమి, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీంతో రేపు వెలువడే ఫలితాలపై రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ బహిష్కృత నేత శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేను నేడు వెల్లడించారు.
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించకుండానే ప్రజాకూటమి ప్రజల్లోకి వెళ్లిందని, ఇదే పెద్ద మైనస్ అయిందని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నాయన్నారు. ఇక ఆయన సర్వే విషయానికి వస్తే.. ప్రజాకూటమికి 53 సీట్లు, టీఆర్ఎస్‌కి 41 సీట్లు, బీజేపీకి 10 నుంచి 12 సీట్లు, మజ్లిస్ కు 6 నుంచి 7 సీట్లు వస్తాయని వెల్లడించారు.