kcr: ఇంకో పార్టీకి దిక్కులేకనే ఆ రాష్ట్రాల్లో ‘కాంగ్రెస్’ గెలిచింది: సీఎం కేసీఆర్

  • మూడు రాష్ట్రాల్లో ‘కాంగ్రెస్’ విజయం సాధించింది
  • అక్కడ గెలిస్తే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్! 
  • వేరే ప్రత్యామ్నాయ పార్టీలు లేకనే!

తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజు వెలువడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో బీజేపీ ఓటమి పాలు కావడంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయా పార్టీలపై వ్యాఖ్యలు చేశారు.

 తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ఎందుకంటే, అక్కడ బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ  గెలవడం రొటీన్ అయిపోయిందని, వేరే ప్రత్యామ్నాయ పార్టీలు అక్కడ లేకపోవడమేనని అన్నారు.

ఈ క్రమంలో ఆయా పార్టీలు అవినీతి కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఈ ఆరోపణలను ‘మనం విని, బఫూన్ కావాలి’ అని, ఇదో అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇటువంటి వాటి నుంచి దేశం బయటపడాలని, ఆ పద్ధతి పోవాలంటే, తెలంగాణలో ఏది అనుసరించామో, దేశమంతటా ఆ పద్ధతి అనుసరించబడాలని అభిప్రాయపడ్డారు.  

  • Loading...

More Telugu News