shaktikanta das: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియామకం
- 24 గంటల్లోనే ఆర్బీఐకి కొత్త గవర్నర్
- నోట్ల రద్దు సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న శక్తికాంత
- మరో రెండు రోజుల్లో బాధ్యతలు
ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన 24 గంటల్లోపే ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నోట్ల రద్దు సమయంలో ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన శక్తికాంత దాస్‌ను ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2015-17 మధ్య ఆర్థిక కార్యదర్శిగా ఉన్న శక్తికాంత దాస్ నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వానికి పూర్తి అండగా నిలిచారు. రిజర్వు బ్యాంకుకు 25వ గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్ ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.
61 ఏళ్ల శక్తికాంత దాస్ తమిళనాడు ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులవడంతో 15వ ఆర్థిక సంఘంలో తన సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.