sensex: ఆర్బీఐ ఎఫెక్ట్.. దూసుకుపోయిన మార్కెట్లు
- కొత్త ఆర్బీఐ గవర్నర్ నియామకంతో మార్కెట్లలో జోష్
- 629 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 188 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన వెంటనే... ఆలస్యం చేయకుండా కొత్త గవర్నర్ గా శక్తికాంత్ దాస్ ను నియమించడంతో మార్కెట్లలో జోష్ కనిపించింది. లిక్విడిటీ సమస్యకు కొత్త గవర్నర్ నియామకం కొంత మేర పరిష్కారం చూపుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ స్టాకుల అండతో మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 629 పాయింట్లు లాభపడి 35,779కి పెరిగింది. నిఫ్టీ 188 పాయింట్లు పుంజుకుని 10,738కి చేరింది.
టాప్ గెయినర్స్:
మన్ పసంద్ బెవరేజెస్ (15.12%), హెచ్డీఐఎల్ (13.67%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (12.27%), ఇండియాబుల్స్ రియలెస్టేట్ (9.99%), ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ (9.01%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-4.69%), వక్రాంగీ (-3.24%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-3.02%), ర్యాలీస్ ఇండియా (-2.79%), గోద్రెజ్ ఇండస్ట్రీస్ (-1.86%).