jupally krishna rao: నా ఓటమికి కారణం ఇదే: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

  • టీఆర్ఎస్ నేతలే నాకు వ్యతిరేకంగా ఓట్లు వేయించారు
  • ఓడిపోయాననే బాధ లేదు
  • ఐదేళ్లు విశ్రాంతి తీసుకుంటా
తమ సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయించారని... అందుకే తాను ఓడిపోయానని మాజీ మంత్రి, కొల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఓడిపోయాననే బాధ తనలో లేదని... ఐదేళ్లు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఐదుసార్లు తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తన నియోజకర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరాయని చెప్పారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కు చెందినవారే డబ్బులు పంచి, తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ గెలుపుకు కేసీఆర్ సంక్షేమ పథకాలే కారణమని చెప్పారు.
jupally krishna rao
TRS
kollapur

More Telugu News