nalgonda: పదవి ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తా.. నల్గొండలో కోమటిరెడ్డి భావోద్వేగం!
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లిన కార్యకర్తలు
- ప్రజా తీర్పును గౌరవిస్తా
- నల్గొండను దత్తత తీసుకుని కేసీఆర్ అభివృద్ధి చేయాలి
నల్గొండ జిల్లాను దత్తత తీసుకుని కేసీఆర్ అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలైన టీ-కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. నల్గొండలో తన నివాసానికి వచ్చిన కార్యకర్తలను చూసి ఆయన భావోద్వేగం చెందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పును గౌరవిస్తానని, పదవి ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తానని అన్నారు. ఇంతవరకూ తనను నాలుగుసార్లు గెలిపించిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానంటూ భావోద్వేగం చెందారు. ఈ జిల్లాలో అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.