Congress: మధ్యప్రదేశ్ లో.. ఎస్పీ, బీఎస్పీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్
- మ్యాజిక్ ఫిగర్‌కు రెండు సీట్ల దూరంలో కాంగ్రెస్
- 114 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
- బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యమన్న మాయావతి
మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ, బీఎస్పీ మద్దతు ప్రకటించాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం రెండు సీట్ల దూరంలో ఉండటంతో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలుండగా.. కాంగ్రెస్ 114 చోట్ల, బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్‌వాదీ పార్టీ 1, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.
అధికారం చేపట్టాలంటే 116 సీట్లు రావాలి. దీంతో మాయావతి.. కాంగ్రెస్‌తో జత కలిసేందుకు సిద్ధమయ్యారు. అలాగే సమాజ్‌వాది పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ బీజేపీని అధికారంలోకి రానీయకుండా చూడటమే తమ లక్ష్యమని అందుకే కాంగ్రెస్‌తో జతకట్టామని వెల్లడించారు.