cricket: నా ముఖంలో నవ్వు కనిపించకపోవడానికి అదే కారణం కావొచ్చు!: గౌతం గంభీర్

  • జీవితంలో నాకేదీ అంత సునాయాసంగా లభించలేదు
  • 2007 ప్రపంచ కప్ క్రికెట్ లో నాకు స్థానం దక్కలేదు
  • చాలా అప్ సెట్ అయ్యా.. సీరియస్ గా మారిపోయా

ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్.. మనస్ఫూర్తిగా నవ్వుతూ కనపడ్డ క్షణాలు దాదాపు కనబడవు. ఏ స్థాయి మ్యాచ్ లో నైనా బాగా రాణించినా కూడా ఓ చిరునవ్వుతో సరిపెట్టే గౌతమ్ గంభీర్ తాను ఎందుకు సీరియస్ గా ఉంటాడో తాజాగా చెప్పుకొచ్చాడు.

తాను ఎందుకు నవ్వను? అనే విషయమై చాలా మంది ప్రశ్నించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వాలని, సరదాగా ఉండాలని భావిస్తారని, అయితే, జీవితంలో తనకు ఏదీ అంత సునాయాసంగా లభించలేదని, కష్టపడాల్సి రావడంతో అలా ఉండటం అలవాటైపోయిందని అన్నాడు.

అండర్ -12 స్థాయి నుంచి జాతీయ జట్టులోకి వచ్చే వరకు తాను చాలా కష్టపడ్డానని గుర్తు చేసుకున్నాడు. తాను ఎంత బాగా ఆడినా జట్టు నుంచి తప్పించిన రోజులు ఉన్నాయని, ప్రతిసారి జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చేదని అన్నారు. 2007 ప్రపంచ కప్ క్రికెట్ లో తనకు స్థానం దక్కకపోవడంతో సీరియస్ గా మారిపోయానని, తాను మనస్ఫూర్తిగా నవ్వలేకపోవడానికి కారణం అదే కావచ్చని గౌతమ్ గంభీర్ అన్నాడు.

  • Loading...

More Telugu News