Andhra Pradesh: ఏపీని నాలెడ్జ్ హబ్ గా చేస్తా: సీఎం చంద్రబాబు

  • ఐ-హబ్ కు కూడా విశాఖలోనే నాంది పలికాం
  • విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • విశాఖను తీర్చిదిద్దే బాధ్యత నాది

ఏపీని నాలెడ్జ్ హబ్ గా చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖపట్టణంలోని తగరపు వలసలో ఏర్పాటు చేసిన  ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఐ-హబ్ కు కూడా విశాఖపట్టణంలోనే నాంది పలికామని, తద్వారా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అన్నారు.

ఆడుతూపాడుతూ చదివే విద్యకు శ్రీకారం చుట్టామని, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖను తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. యునెస్కో సహకారంతో ఐ-హబ్ వస్తుందని, దీని ఏర్పాటుతో భీమిలికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రపంచానికి అవసరమైన మేధాశక్తిని యునెస్కో అందిస్తుందని చెప్పారు.


కాగా, అంతకుముందు, పెదగంట్యాడలోని  మెడ్ టెక్ జోన్ లో డబ్ల్యుహెచ్ వో సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వైద్య వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టామని, వైద్య పరీక్ష కేంద్రాలు, పరికరాల తయారీ కేంద్రాలు రావడం వల్లే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News