Union government: 2014 నుంచి ఇప్పటి వరకు ప్రకటనల కోసం కేంద్రం పెట్టిన ఖర్చెంతో తెలుసా?
- ప్రభుత్వ పథకాలకు విశేష ప్రచారం
- ప్రకటనల కోసం వేల కోట్ల ఖర్చు
- స్వయంగా వెల్లడించిన కేంద్ర మంత్రి
ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో కేంద్రం చేస్తున్న ఖర్చు వేల కోట్లు దాటిపోతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ.5,200 కోట్లు ఖర్చు చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతోపాటు ఇతర మాధ్యమాల ద్వారా 2014-15 సంవత్సరం నుంచి ప్రకటన కోసం రూ.5,200 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
లోక్ సభలో ఓ ప్రశ్నకు మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014-15లో రూ.979.78 కోట్లు, 2015-16లో రూ.1,160.16 కోట్లు, 2016-17లో రూ.1,264 కోట్లు, 2017-18లో రూ.1,313 కోట్లను ఖర్చు చేయగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.527.96 క కోట్లను ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు.