Kurnool District: ఎందుకు ఓడిపోయామో విశ్లేషిస్తున్నా!: చంద్రబాబునాయుడు

  • కూటమి విఫలానికి చాలా కారణాలు
  • ఓటమికి ఏ ఒక్కరిదో బాధ్యత కాదు
  • కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్ కు చంద్రబాబు శంకుస్థాపన

తెలంగాణలో ప్రజాకూటమి విఫలం కావడానికి చాలా కారణాలు ఉన్నాయని, వాటన్నింటినీ విశ్లేషిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్నూలు జిల్లాలో రాంకో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ పరిశ్రమకు అమరావతి ప్రజా వేదిక నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఆపై పరిశ్రమ పరిధిలోకి వచ్చే కొలిమిగుండ్ల మండలం కలవట్ల గ్రామస్థులు, రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేనలు అతన్ని పొగుడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఓటమికి ఏ ఒక్కరిదో బాధ్యత కాదని చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పినందునే కాంగ్రెస్ పార్టీతో కలిశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధికి పాటు పడాల్సిన కేంద్రం ఆ పని చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News