shivraj singh chouhan: నేను ఇక్కడే ఉంటా.. ఇక్కడే మరణిస్తా: శివరాజ్ సింగ్ చౌహాన్

  • జాతీయ రాజకీయాల్లోకి శివరాజ్ వెళతారంటూ ఊహాగానాలు
  • కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోనన్న శివరాజ్
  • రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తానంటూ వెల్లడి
తాను ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. వరుసగా మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంతో ఆయన మాజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో, ఎంతో అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ సేవలను జాతీయ స్థాయిలో బీజేపీ ఉపయోగించుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ, తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను మధ్యప్రదేశ్ లోనే ఉంటానని, ఇక్కడే మరణిస్తానని చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. మరోవైపు, మధ్యప్రదేశ్ లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటున్నానని శివరాజ్ సింగ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 
shivraj singh chouhan
national politics
Madhya Pradesh
bjp

More Telugu News