Andhra Pradesh: ఆంధ్రా అభివృద్ధిని యజ్ఞంలా చేపడుతుంటే కొందరు అడ్డుకుంటున్నారు!: ప్రతిపక్షాలపై సీఎం చంద్రబాబు ఫైర్
- నదుల అనుసంధానంతో సీమకు నీరు
- ఉద్యాన పంటల్లో రాయలసీమ టాప్
- పోలవరానికి కేంద్రం మొండిచెయ్యి
ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానం చేయడం వల్లే రాయలసీమకు పుష్కలంగా సాగునీరు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉద్యాన పంటల్లో రాయలసీమ దేశానికే తలమానికంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కియా కార్ల పరిశ్రమ రావడంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగంలో దాదాపు రూ.20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రాభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే కొందరు దాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ప్రతిపక్షాలను పరోక్షంగా విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సొంతంగానే నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్పారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు సాయం నిలిపివేసినా, పనులు కొనసాగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.