sensex: ఒడిదుడుకులకు లోనై.. చివరకు స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
- ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గుచూపిన మదుపరులు
- 33 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 14 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు, మదుపుదారులు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 35,963కు పెరిగింది. నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 10,805 వద్ద స్థిరపడింది.
టాప్ గెయినర్స్:
మ్యాక్స్ ఇండియా (19.99%), రిలయన్స్ నేవల్ (16.34%), పీసీ జువెలర్స్ (6.64%), భారతీ ఎయిర్ టెల్ (5.32%), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (5.17%).
టాప్ లూజర్స్:
ఫోర్టిస్ హెల్త్ కేర్ (-6.75%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-4.76%), టోరెంట్ పవర్ (-4.49%), వక్రాంగీ (-4.06%), సౌత్ ఇండియన్ బ్యాంక్ (-3.73%).