Andhra Pradesh: తుపాన్ ముందస్తు చర్యలపై ఆరా.. చంద్రబాబుకు ఫోన్ చేసిన గవర్నర్!
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- చంద్రబాబుకు సూచించిన గవర్నర్
- అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం
పెథాయ్ తుపాన్ దృష్ట్యా ఏపీలో తీసుకున్న ముందస్తు చర్యల గురించి గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. సీఎం చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి ఆ వివరాలను తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.
కాగా, శ్రీహరికోటకు 720 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుపాన్ కేంద్రీకృతమై ఉంది. కాకినాడ-విశాఖపట్టణం మధ్య ఈ నెల 17న తీరం దాటే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రాగాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.