Virat Kohli: కెరీర్ లో 25వ సెంచరీ సాధించిన కోహ్లీ... 200 దాటిన భారత స్కోరు!
- ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కోహ్లీ
- 219 బంతుల్లో సెంచరీ
- భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన కెరీర్ లో 25వ సెంచరీని సాధించాడు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే విఫలమైనా, అండగా నిలిచి భారీ స్కోరును మరెవరూ సాధించలేకపోయినా, ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కోహ్లీ ముందుకు సాగి, భారత స్కోరును 200 పరుగులు దాటించాడు.
సెంచరీ సాధించేందుకు కోహ్లీకి 219 బంతులు అవసరమయ్యాయంటే, ఇన్నింగ్స్ ఎంత నిదానంగా సాగిందో తెలుసుకోవచ్చు. ఈ ఉదయం మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే, హాఫ్ సెంచరీ చేసిన రహానే 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆపై హనుమ విహారి వచ్చి స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. ప్రస్తుతం విహారి 18 పరుగుల వద్ద ఉండగా, భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు. రహానే వికెట్ లియాన్ కు దక్కింది.