AISTF: విద్యారంగ వ్యతిరేక విధానాలపై నిరసన.. ‘చలో పార్లమెంట్’కు ఉపాధ్యాయుల నిర్ణయం
- ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య
- ఫిబ్రవరి 18వ తేదీన కార్యక్రమం
- చండీగఢ్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం
ఉపాధ్యాయ సమాఖ్య ఫిబ్రవరి 18వ తేదీన చలో పార్లమెంటు నిర్వహించాలని నిర్ణయించింది. చండీగఢ్‌లో శనివారం జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎస్టీఎఫ్) కార్యవర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా పలు విధానాలను అమల్లోకి తెస్తుండడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల గళం ఢిల్లీ స్థాయిలో వినిపించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పడేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్టీయూ కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.