Rahul Gandhi: కాంగ్రెస్ అధినేతగా ఏడాది పూర్తి చేసుకున్న రాహుల్... సాధించిన ఘన విజయాలు ఇవే!

  • జనవరిలో అల్వార్, అజ్మీర్ లోకసభ ఉపఎన్నికల్లో విజయం
  • మేలో జేడీఎస్ తో కలసి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు
  • సోషల్ మీడియాలో బీజేపీకి దీటుగా ఎదిగిన కాంగ్రెస్

కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేటితో రాహుల్ గాంధీ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో రెండో ఏడాదిలోకి ఆయన అడుగుపెట్టారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' నినాదంతో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్... పార్టీని ఎలా బలోపేతం చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మూడు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించడం ద్వారా పార్టీని కాపాడటమే కాక, పునర్వైభవం దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు.

పార్టీ అధినేతగా రాహుల్ పగ్గాలు చేపట్టిన తర్వాత జనవరిలో కాంగ్రెస్ కు తొలి విజయం దక్కింది. అల్వార్, అజ్మీర్ లోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మే నెలలో జేడీఎస్ తో కలసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది వరకు సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో బీజేపీ ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో ఉండేది. రాహుల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా వ్యవహరించడం మొదలు పెట్టింది. తాజాగా మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం ద్వారా... పూర్తి ఆత్మవిశ్వాసంతో 2019 ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 

  • Loading...

More Telugu News