pethai cyclone: పెథాయ్ ఎఫెక్ట్.. కాకినాడలో నిలిచిన విద్యుత్ సరఫరా

  • నేటి సాయంత్రం తీరం దాటనున్న తుపాను
  • ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
  • తుపాను చర్యలపై సీఎం సమీక్ష

పెథాయ్ తుపాను ప్రభావం మొదలైంది. ఈ సాయంత్రం కాకినాడలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో కాకినాడలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీరం దాటే సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలకు సహాయ బృందాలను పంపినట్టు తెలిపారు. అలాగే, ఐదు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధంగా ఉన్నాయని, మరో 5 వేల స్తంభాలు నేడు చేరుతాయని తెలిపారు. ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో 500 మంది సిబ్బంది పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మొత్తం 2 వేల మందిని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

 విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన క్రేన్లు, జేసీబీలు, పోల్ డిగ్గింగ్ యంత్రాలను ఇప్పటికే ఉత్తరాంధ్రకు చేర్చినట్టు వివరించారు. విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాలకు 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్టు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి  వరప్రసాద్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News