sensex: వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- మార్కెట్లలో కొనసాగుతున్న పాజిటివ్ ట్రెండ్
- 307 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 83 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం, ఆర్బీఐకి కొత్త గవర్నర్ ను నియమించడంతో మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 307 పాయింట్లు పెరిగి 36,270కి ఎగబాకింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 10,888కి చేరుకుంది.
టాప్ గెయినర్స్:
బీఈఎంఎల్ (8.04%), కాక్స్ అండ్ కింగ్స్ (7.20%), హిందుస్థాన్ కాపర్ (6.02%), అవంతి ఫీడ్స్ (5.97%), ఎంఎంటీసీ (5.78%).
టాప్ లూజర్స్:
ప్రిస్టేజ్ ఎస్టేట్స్ (-6.06%), క్వాలిటీ (-4.99%), వక్రాంగీ (-4.96%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-4.88%), జెట్ ఎయిర్ వేస్ (-3.79%).