Pethai: తీరాన్ని దాటి తిరిగి సముద్రంలోకి... కాసేపు వణికించిన పెథాయ్!

  • ఆంధ్రప్రదేశ్ కు తప్పిన పెథాయ్ ముప్పు
  • రెండుసార్లు తీరం దాటిన తుపాను
  • ప్రస్తుతం ఒడిశాలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ కు పెథాయ్ ముప్పు తప్పింది. ఇదే సమయంలో కాసేపు అధికారులను వణికించింది కూడా. నిన్న మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడ - యానాం మధ్య కాట్రేనికోన సమీపంలో తీరం దాటిన తుపాను తన ప్రయాణ దిశను మార్చుకుని తిరిగి సముద్రంలోకి వెళ్లింది. ఈ సమయంలో సర్వత్ర టెన్షన్ వాతావరణం నెలకొనగా, రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తుని సమీపంలో మరోసారి తీరం దాటి, బలహీనపడి, వాయుగుండంగా మారి ఒడిశా వైపు వెళ్లిపోయింది.

పెథాయ్ ప్రభావం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై అధికంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన్ టవర్లు నేలకొరిగాయి. దాదాపు 1000 గొర్రెలు మృతి చెందగా, 9.37 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. తుపాను తీరం దాటే సమయంలో భారీగా అలలు ఎగిసిపడ్డాయి. తాళ్లరేవు, కాకినాడ, అమలాపురం, ఉప్పల గుప్తం, ఉప్పాడ, సఖినేటిపల్లి, కొత్తపల్లి, మామిడికుదురు ప్రాంతాల్లో వర్షాలు ఇంకా పడుతూనే ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

  • Loading...

More Telugu News