latha: ఎంజీఆర్ గారు నా పేరు మార్చారు: సీనియర్ హీరోయిన్ లత
- నా అసలు పేరు నళిని
- పుట్టిపెరిగింది చెన్నైలో
- లత అని పిలిస్తే పలికేదానిని కాదు
తెలుగు తెరకి 'అందాల రాముడు' సినిమా ద్వారా 'లత' కథానాయికగా పరిచయమయ్యారు. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను కథానాయికగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి 'లత' తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తనకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.
" నేను పుట్టి పెరిగింది చెన్నై లోనే .. మా పూర్వీకులది కర్నూల్ దగ్గర 'నాగలాపురం' అనే గ్రామం. సినిమాల్లోకి రావడానికి ముందు నా పేరు 'నళిని'. తమిళ చిత్ర పరిశ్రమలో అప్పటికే ఒక నళిని ఉండటం వలన, నా పేరును ఎంజీఆర్ గారు 'లత' అని మార్చారు. పేరు మార్చుకున్న కొంతకాలం వరకూ 'లత' అని ఎవరైనా పిలిస్తే పలికేదానిని కాదు. నా దగ్గరికి వచ్చి .. 'నిన్నే పిలిచేది' అని ఎవరైనా అంటే, 'ఓహో నా పేరు లత కదా' అనుకునేదానిని. అలా కొత్త పేరుకు నేను అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.