rbi ex govener: ఉర్జిత్ పటేల్ ని పదవి నుంచి తప్పుకోమని ఎవరూ ఒత్తిడి చేయలేదు: అరుణ్ జైట్లీ
- మూలధన మిగులు నగదు నిల్వలు కేంద్రానికెందుకు?
- ఇటీవల ఆర్బీఐ బోర్డు సమావేశం చక్కగా జరిగింది
- సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి
ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి ఉర్జిత్ పటేల్ ఇటీవల తప్పుకోవడం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఆయన తన పదవికి రాజీనామా చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆర్బీఐ మూలధన మిగులు నగదు నిల్వల బదలాయింపు, ఆర్బీఐ స్వతంత్రత వంటి విషయాలపై కేంద్రం, రిజర్వ్ బ్యాంకు మధ్య విభేదాలు తలెత్తాయని ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు స్పందిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మూలధన మిగులు నగదు నిల్వల నుంచి కేంద్రానికి ఒక్క పైసా కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. ఉర్జిత్ పటేల్ ని పదవి నుంచి తప్పుకోమని ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలోనూ బ్యాంక్ అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సుహృద్భావ చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు