Tamil Nadu: సోదరుడిపై పన్నీర్ సెల్వం ఆగ్రహం.. పార్టీ నుంచి బహిష్కరణ!
- పన్నీర్ సెల్వం సోదరుడు రాజా
- సెల్వం వద్దన్నా సహకార సంఘం ఎన్నికల్లో పోటీ
- పార్టీ నుంచి బహిష్కరణ..ప్రాథమిక సభ్యత్వం రద్దు
తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన సోదరుడు రాజాపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి మధురైలోని ఆవిన్ పాల సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన రాజాపై వేటు వేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేశారు.
ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాజాతో ఎటువంటి సంబంధాలు నెరపవద్దని పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, థేని జిల్లాలోని పెరియకులం పంచాయతీ సర్పంచ్ గా రాజా పని చేశారు. పన్నీర్ సెల్వంకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆవిన్ పాల సహకార సంఘం ఎన్నికల్లో రాజా పోటీ చేసి గెలిచారు.