Haribabu: సర్వే శాఖలో సాధారణ ఉద్యోగి.. అవినీతిలో మాత్రం టాప్: ఏసీబీకి చిక్కిన పెనమలూరు సర్వేయర్

  • 12 గంటలకు పైగా సోదాలు
  • రూ. 20 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు
  • లాకర్‌లో మూడు కిలోల బంగారం

కృష్ణా జిల్లా పెనమలూరు మండల సర్వేయర్ కొల్లి హరిబాబు ఇంటిపై బుధవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడి చేశారు. సర్వేశాఖలో అతి సాధారణ ఉద్యోగి అయిన హరిబాబు ఇంట్లో బయటపడుతున్న ఆస్తుల చిట్టా చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు  హరిబాబు నివాసంతోపాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ. 20 కోట్లకుపైగా ఆస్తులను అధికారులు గుర్తించారు.

12 గంటలకు పైగా జరిగిన ఈ సోదాల్లో ఇళ్ల స్థలాలు, ఫ్లాట్, వ్యవసాయ భూములు, బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. విజయవాడలోని గాయత్రీనగర్, కరెన్సీ నగర్‌లోని ఎస్‌బీఐ శాఖల్లోని మూడు లాకర్లలో ఆభరణాలు, బిస్కెట్లు, మూడు వడ్డాణాలు బయటపడ్డాయి. మొత్తంగా మూడు కిలోల బంగారం, 1.5 కిలోల వెండి, బ్యాంకు ఖాతాల్లో రూ.11 లక్షలు, విజయవాడ, నాగార్జున నగర్, గన్నవరం,  నూజివీడు మండలం గొల్లపల్లి, విజయవాడలోని క్రీస్తురాజపురం, పెనమూలు మండలం పోరంకి తదతర ప్రదేశాల్లో భూములు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

  • Loading...

More Telugu News