Chandrababu: చిత్తూరులో సిలికాన్ సిటీ ఏర్పాటు...వచ్చే డిసెంబరు నాటికి టీసీఎల్ ఉత్పత్తులు : ఏపీ సీఎం చంద్రబాబు
- రాబోయే రోజుల్లో జిల్లాకు తరలిరానున్న పలు కంపెనీలు
- తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనుంది
- మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
చిత్తూరు జిల్లాలో సిలికాన్ సిటీ ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్నో కంపెనీలు జిల్లాకు తరలిరానున్నాయని, తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనుందని తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో చైనా జైంట్ టీసీఎల్ కంపెనీకి భూమిపూజ చేశారు.
టీవీ ప్యానళ్ల తయారీలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కంపెనీగా గుర్తింపు పొందిన టీసీఎల్ ఏడాదికి 60 లక్షల టీవీల తయారీ లక్ష్యంతో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి కంపెనీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా మారిందని, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.