jagan: జగన్ పాదయాత్రలో మరో మైలురాయి.. మొక్కను నాటిన వైసీపీ అధినేత.. వీడియో చూడండి
- 3,500 కిలోమీటర్లకు చేరుకున్న జగన్ పాదయాత్ర
- రావివలస వద్ద మొక్కను నాటిన జగన్
- భారీ సంఖ్యలో జగన్ ను అనుసరిస్తున్న పార్టీ శ్రేణులు
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర అన్ని జిల్లాలను దాటి చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు పాదయాత్ర 3,500 కిలోమీటర్లను చేరుకుంది. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద జగన్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.
3,500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న ప్రజాసంకల్ప యాత్ర. టెక్కలి నియోజకవర్గం, రావివలస వద్ద మొక్కను నాటిన శ్రీ వైయస్ జగన్.#PrajaSankalpaYatra pic.twitter.com/IFz5rhLamy
— YSR Congress Party (@YSRCParty) December 22, 2018