elections commission: పోస్టాఫీసుల ద్వారా ఓట్లను నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలి!: జేపీ
- ఓట్ల గల్లంతుపై క్షమాపణ చెప్పిన రజత్ కుమార్
- పోస్టాఫీసులను నోడల్ ఏజెన్సీలుగా మార్చాలని సూచించిన జేపీ
- స్వతంత్ర ప్రతిపత్తి గల లోకాయుక్త కోసం పోరాటం చేస్తాం
తెలంగాణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైన విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జయప్రకాశ్ నారాయణ స్పందించారు. రజత్ కుమార్ క్షమాపణ చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఓట్ల గల్లంతుపై ఆయన స్పందిస్తూ... పోస్టాఫీసులను నోడల్ ఏజెన్సీలుగా మార్చాలని సూచించారు. ఎవరైనా, ఎప్పుడైనా పోస్టాఫీసుల ద్వారా ఓట్లను నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. అవినీతిని అరికట్టడంలో లోకాయుక్త కీలక పాత్ర పోషిస్తుందని... స్వతంత్ర ప్రతిపత్తి గల లోకాయుక్త కోసం లోక్ సత్తా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.