Chandrababu: నేను మోదీ విధానాలకు వ్యతిరేకిని కానీ మోదీకి కాదు: చంద్రబాబు

  • మొదటి నుంచి మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్నా
  • గోద్రా అల్లర్ల సమయంలో రాజీనామా కోసం డిమాండ్ చేశా
  • 29 సార్లు ఢిల్లీకి వెళ్తే కనీస మర్యాద కూడా ఇవ్వలేదు

తాను మోదీ విధానాలకు తప్ప మోదీకి వ్యక్తిగతంగా వ్యతిరేకిని కానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తాను తొలి నుంచీ మోదీ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. గోద్రా అల్లర్ల సమయంలో మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఆయన విధానాలకే తప్ప వ్యక్తిగతంగా తాను మోదీకి వ్యతిరేకిని కానన్నారు. విశాఖపట్టణంలో ‘ఇండియా టుడే’ నిర్వహిస్తున్న రెండు రోజుల దక్షిణ ప్రాంతీయ సదస్సు-2018లో పాల్గొన్న చంద్రబాబు సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పై విధంగా పేర్కొన్నారు.

బీజేపీతో చెలిమి ఎందుకు చేశారన్న రాజ్‌దీప్ ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. విభజన హామీలు నెరవేరుస్తారని, హోదా ఇస్తారనే నమ్మకంతోనే బీజేపీతో కలిసి 2014లో ముందుకెళ్లినట్టు వివరించారు. రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ 29 సార్లు తాను ఢిల్లీకి వెళ్లానని, అన్నిసార్లు వెళ్లినా తనకు కనీస మర్యాద ఇవ్వలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News