Qamar Javed Bajwa: ఇమ్రాన్ వ్యాఖ్యలను మా చేతకాని తనంగా భావించొద్దు: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్
- మా దేశం శాంతినే నమ్ముతుంది
- భారత్ కు ఇమ్రాన్ ఖాన్ స్నేహ హస్తాన్ని అందిస్తున్నారు
- యుద్ధాల వల్ల వినాశనమే మిగులుతుంది
భారత్-పాక్ ల మధ్య శాంతి నెలకొనే దిశగా తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్నేహ హస్తాన్ని అందిస్తున్నారని... అయితే, దాన్ని తమ చేతకాని తనంగా భావించవద్దని భారత్ ను ఉద్దేశించి పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇమ్రాన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కరాచీలో ఆర్మీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పాకిస్థాన్ శాంతిని ప్రేమించే దేశమని... తమ దేశం శాంతినే నమ్ముతుందని తెలిపారు. శాంతిని నెలకొల్పడం ద్వారా ఇరు దేశాల్లోని పేదరికం, నిరక్షరాస్యతలాంటి ఎన్నో సమస్యలు సమసిపోతాయని చెప్పారు.
ఎంతో చిత్తశుద్ధితో తమ ప్రధాని భారత్ కు స్నేహ హస్తం అందిస్తున్నారని... దాన్ని తమ చేతకాని తనంగా భావించవద్దని బజ్వా తెలిపారు. యుద్ధాల వల్ల మరణాలు, వినాశనం, ఆవేదన మిగులుతాయని చెప్పారు. శాంతియుత చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.