Japan: బ్రేకింగ్... జపాన్ లో భూకంపం!

  • మికులా ప్రాంతంలో 5.5 తీవ్రతతో ప్రకంపనలు
  • టోంగాలో 6.4 తీవ్రతతో భూకంపం
  • వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం

ఇండోనేషియా పరిధిలోని జావా, సుమత్రా దీవుల్లో అగ్నిపర్వతం బద్దలై, దాని కారణంగా సునామీ అలలు విరుచుకుపడి, సుమారు 300 మందిని బలిగొన్న ఘటనను మరువకముందే, ఈ ఉదయం జపాన్ ను భూకంపం వణికించింది. మికులా, జిమా అగ్నిపర్వత ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

 ఇదే సమయంలో పసిఫిక్ ద్వీప దేశం టోంగాలోనూ భూమి కంపించింది. దీని తీవ్రత 6.4 గా నమోదుకాగా, పలు భవంతులకు బీటలు వారినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనల కారణంగా భయంతో ప్రజలు వేలాదిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ భూకంపం ఫలితంగా సునామీ అలలు వచ్చే ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టంపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News