Bandla Ganesh: నేను ఆత్మహత్య చేసుకోవాలని మీరు కోరుకుంటే... మీరు బ్లేడ్ ఇవ్వండి, లైవ్ లో గొంతు కోసుకుంటా: బండ్ల గణేశ్
- బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని చెప్పిన గణేశ్
- ప్రజలను, కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకే ఆ వ్యాఖ్యలు
- సోషల్ మీడియా ప్రచారంతో భయపడుతున్న కొడుకు
- సోషల్ మీడియాలో కనీస జ్ఞానం లేకపోయిందని మండిపాటు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకుంటే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని చెప్పి, నెటిజన్ల సెటైర్లకు గురైన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్, మరోసారి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఓ తెలుగు టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, "7 ఓ క్లాక్, 8 ఓ క్లాక్ ఏంటిసార్? చాలా మంది చాలా మాటలు అంటారు. బ్లేడ్లు పనిచేయవు సార్. వంద అంటాము సార్. నేను ఆత్మహత్య చేసుకోవాలని మీకుంటే, మీరు బ్లేడ్ ఇస్తే నేను కోసేసుకుంటాను. లైవ్ లో కోసేసుకుంటాను.
ఒకటి చెబుతున్నా... చాలెంజ్ అంటే, ప్రజలను ఉత్తేజ పరచడానికి, వారిని మా పార్టీ వైపు ఆకర్షించడానికి, మా కార్యకర్తల్లో నమ్మకం చేకూర్చడానికి మాట్లాడాం. ఇదే... ఈ సోషల్ మీడియాలో నాయకులు మాట్లాడే మాటల వల్ల... ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు నా కొడుకు. వాడొచ్చి, నాన్నా నీ దగ్గర పడుకుంటానని అనడం, నాకు చెప్పకుండా మా వాళ్లకు చెప్పి, నా వెనకాల సెక్యూరిటీని పెట్టడం చేస్తున్నాడు... అనకూడదు కానీ, అంత జ్ఞానం కూడా రాసిన మీడియా వాళ్లకు లేకుంటే ఎలా?" అని వ్యాఖ్యానించారు. 16 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ చెప్పడం, నేల విడిచి సాము చేయడమేనని అభివర్ణించిన ఆయన, ఓ నాయకుడిగా కేసీఆర్ మాట్లాడితే స్వాగతిస్తానని చెప్పారు.