bjp: రథయాత్ర... సుప్రీంకోర్టులో బీజేపీకి చుక్కెదురు

  • రథయాత్ర అనుమతి కోసం సుప్రీంలో బీజేపీ
  • అత్యవసర విచారణ అవసరం లేదన్న సుప్రీం
  • సాధారణ కేసుల్లాగే దీన్ని కూడా పరిగణిస్తున్నామంటూ వ్యాఖ్య

పశ్చిమబెంగాల్ లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీకి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సాధారణ కేసుల్లాగానే దీన్ని కూడా పరిగణిస్తున్నామని చెప్పింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రథయాత్రను చేపట్టాలనుకున్నారు. శాంతిభద్రతల కారణంగా అనుమతిని ఇవ్వలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కలకత్తా హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో, బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News