telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు.. వివరాలు ఇవిగో!

  • తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం
  • రిజర్వేషన్లను ఖరారు చేసిన ప్రభుత్వం
  • మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఆ వివరాలను ఎన్నికల సంఘానికి పంపింది.

రిజర్వేషన్లు వివరాలు ఇవే:
  • ఎస్సీలకు - 2,113 గ్రామపంచాయతీలు
  • షెడ్యూల్ ఏరియాలోని ఎస్టీలకు - 1,281
  • వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు - 1,177
  • మిగిలిన గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు - 688
  • బీసీలకు - 2,345
  • జనరల్ - 5,147

వీటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలన్నింటినీ ఎస్టీ రిజర్వుడుగా పేర్కొంది.

  • Loading...

More Telugu News