assam: అసోం-అరుణాచల్ మధ్య బోగీబీల్ వంతెన ప్రారంభం

  • తిన్ సుకియా- నహర్ల్ గన్ పట్టణాల మధ్య ప్రారంభం
  • వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • వంతెన కింది భాగంలో 2 లైన్ల రైలు పట్టాలు
  • వంతెన పైభాగంలో 3 లైన్ల రహదారి ఉంటాయి

అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బోగీబీల్ వంతెన అందుబాటులోకి వచ్చింది. అసోంలోని తిన్ సుకియా.. అరుణాచల్ ప్రదేశ్ లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య దీనిని నిర్మించారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతిని పురస్కరించుకుని  ‘బోగీబీల్’ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు.

అనంతరం, దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనపై మోదీ కొంత దూరం నడిచారు. దీని నిర్మాణాన్ని పరిశీలించారు. మోదీ వెంట అసోం గవర్నర్ జగదీష్ ముఖీ, సీఎం శర్వానంద సోనోవాల్  ఉన్నారు. కాగా, ఈ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని హెచ్ డీ దేవెగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి దీని నిర్మాణపనులను ప్రారంభించారు.

 ‘బోగీబీల్’ గురించి చెప్పాలంటే..

 - వంతెన కింది భాగంలో 2 లైన్ల రైలు పట్టాలు ఉంటాయి
- వంతెన పైభాగంలో 3 లైన్ల రహదారి ఉంది
- ఈ వంతెన పొడవు 4.94 కిలోమీటర్లు
- దీని నిర్మాణానికైన ఖర్చు రూ.5.920 కోట్లు
- అసోంలోని తిన్ సుకియా..అరుణాచల్ ప్రదేశ్ లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య ప్రయాణ దూరం 500 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గుతుంది
- దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది
- రక్షణ సామాగ్రి తరలించే అత్యంత భారీ వాహనాలు దీనిపై వెళ్లొచ్చు
- ఈ వంతెనపై యుద్ధ విమానాలు సైతం దిగొచ్చు

  • Loading...

More Telugu News