Melbourne: అరంగేట్రంలోనే అదరగొడుతున్న మయాంక్ అగర్వాల్... తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ!

  • మెల్‌ బోర్న్‌ లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
  • తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్
  • నమ్మకాన్ని నిలుపుకుంటూ హాఫ్ సెంచరీ
మెల్‌ బోర్న్‌ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్ లోనే ఓపెనర్ గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్, సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, 95 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు కూడా ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ జోడీని మార్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విఫలమైన రాహుల్, మురళీ విజయ్‌ ల స్థానంలో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లను పంపారు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు కాగా, మయాంక్ 53, పుజారా 19 పరుగులతో ఆడుతున్నారు.
Melbourne
Mayank Agarwal
India
Australia
Cricket

More Telugu News