sumanth: ఈ సారి ఓ కొత్త ప్రయోగం చేశాను: సుమంత్

  • సుమంత్ హీరోగా 'ఇదమ్ జగత్'
  • ప్రెస్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించే కథ 
  • ఈ నెల 28వ తేదీన రిలీజ్

సుమంత్ కథానాయకుడిగా 'ఇదం జగత్' సినిమా రూపొందింది. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి సుమంత్ రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి సుమంత్ ప్రస్తావించాడు."ఇది డార్క్ డ్రామా థ్రిల్లర్ గా నిర్మితమైంది. ఈ తరహా సినిమాను నేను చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో నేను ఒక రిపోర్టర్ గా కనిపిస్తాను.

ఈ సినిమాలో నేను హీరోను అని గానీ .. విలన్ ను అని గాని చెప్పను. ఈ రెండింటికి అతీతంగా నా పాత్ర ఉంటుంది. ఒక రిపోర్టర్ స్వార్థపరుడైతే అతను ఏం చేయగలడు? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రెస్ లోని మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో నేను ఒక ప్రయోగమే చేశాను. ఈ ప్రయోగం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News