High Court: ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ విడుదల
- రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు
- జనవరి 1 నుంచి వేర్వేరుగా పనిచేయనున్న హైకోర్టులు
- తెలంగాణకు 10, ఏపీకి 16 మంది న్యాయమూర్తుల కేటాయింపు
రాష్ట్ర పునర్విభజన జరిగినప్పటి నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 2019 జనవరి 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు.
కాగా, మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు పదిహేను వందల మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్ బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను రెండు హైకోర్టులకు కేటాయించనున్నారు. ఆయా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం కూడా పూర్తయినట్టు సమాచారం.