Rahul dravid: పెట్టుబడులకు మూడు రెట్ల లాభాలు.. మాజీ క్రికెటర్ ద్రవిడ్ ఖాతాల స్తంభన
- విక్రమ్ ఇన్వెస్టిమెంట్‌లో ద్రవిడ్ పెట్టుబడులు
- సంస్థ నిబంధనల ప్రకారం రిజిస్టర్ కాలేదన్న సీఐడీ
- పెట్టుబడిదారులుకు డివిడెండ్లు కూడా చెల్లించని వైనం
టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు కర్ణాటక రాష్ట్ర సీఐడీ అధికారులు గురువారం షాకిచ్చారు. బెంగళూరులోని విక్రమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టుబడులు పెట్టిన రాహుల్ ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. పెట్టుబడులకు మూడు రెట్లకుపైగా ద్రవిడ్ లాభాలు పొందారన్న సమాచారంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విక్రమ్ ఇన్వెస్టిమెంట్‌లోని ద్రవిడ్ రెండు ఖాతాలను సీజ్ చేసినట్టు సీఐడీ తెలిపింది. నిజానికి ఈ సంస్థ నిబంధనల ప్రకారం రిజిస్టర్ కాలేదని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన చాలామందికి డివిడెండ్లు కూడా చెల్లించలేదని పేర్కొన్నారు.