Laloo Prasad Yadav: 'బాబాయ్, నాకో ఇల్లు ఇవ్వవా?' అని తేజ్ ప్రతాప్ అడగ్గానే తన పాత ఇల్లును అప్పగించిన నితీశ్ కుమార్!

  • భార్యతో విడాకులు కోరుతున్న తేజ్ ప్రతాప్
  • కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని కోరుకున్న లాలూ తనయుడు
  • కొత్త ఇంటిని కేటాయించిన బీహార్ సర్కారు

భార్యతో విభేదాలు వచ్చి విడాకులు కోరుతూ, ఇంటికి దూరమైన తేజ్ ప్రతాప్ యాదవ్ కు బీహార్ ప్రభుత్వం కొత్త ఇంటిని మంజూరు చేసింది. తనకు ఓ ఇల్లు కేటాయించాలని దాదాపు నెల రోజుల క్రితం తేజ్ ప్రతాప్ దరఖాస్తు చేసుకోగా, అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన సీఎం నితీశ్ కుమార్ కు ఫోన్ చేసి "బాబాయ్... నాకో ఇల్లు ఇవ్వవా?" అని అడుగగా, వెంటనే ఆయన స్పందించారు.

 తాను సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, అధికార నివాసంలోకి మారడానికి ముందు నివసించిన ఇంటిని కేటాయించారు. ఈ ఇల్లు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నివసించిన సర్క్యులర్ రోడ్ లోని 10వ నంబర్ బంగళాకు సమీపంలోనే ఉండటం గమనార్హం. కాగా, తేజ్ ప్రతాప్ కు ఇంటిని కేటాయించడంపై నితీశ్ స్పందిస్తూ, తేజ్ తన భార్యను తిరిగి కలుసుకునేందుకు, ఇద్దరూ ఒకటయ్యేందుకు ఈ ఇల్లు సహకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే తేజ్, ఐశ్వర్యల మధ్య విభేదాలు సమసిపోతాయని అనుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News