hanu raghavapoodi: నా అంత గొప్ప డైరెక్టర్ లేడని నేనెప్పుడూ అనుకోలేదు: హను రాఘవపూడి

  • చేస్తున్న పనిపైనే దృష్టి పెడతాను
  • ఒకేసారి రెండు మూడు పనులు చేయడం నచ్చదు 
  • నన్ను చూసి అలా అనుకుని వుంటారు

హను రాఘవపూడి పేరు వినగానే 'అందాల రాక్షసి' .. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాలు గుర్తుకు వస్తాయి. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించడంలో ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'పడిపడి లేచె మనసు' ఇటీవలే థియేటర్లకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

"నా అంత తోపు డైరెక్టర్ ఇండస్ట్రీలో ఎవరూలేరని మీరు అనుకుంటూ వుంటారనే ఒక విమర్శ వుంది .. దానికి మీరేమంటారు?" అనే ప్రశ్న హను రాఘవపూడికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజంలేదు. ఏదైతే పని చేస్తున్నామో దానిపైనే పూర్తి దృష్టి పెట్టాలి. ఒకేసారి రెండుమూడు పనులు చేయాలని చూస్తే .. ఏదో ఒకటి చెడిపోతుంది. నేను అలా చేయను .. వేరేవాళ్లు అలా చేస్తే నాకు నచ్చదు. చేస్తున్న పనిపైనే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెడతాను. ప్రతి సీన్ పట్ల నేను తీసుకునే శ్రద్ధను చూసిన కొంతమందికి అలా అనిపించి ఉండొచ్చు" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News