paruchuri: సినిమా కథను 10 నిమిషాల్లో చెప్పడం కష్టమైన కళ: పరుచూరి గోపాలకృష్ణ
- కథలో ముఖ్యమైన విషయాలు రాసుకోండి
- ముందుగా రికార్డు చేస్తూ ప్రాక్టీస్ చేయండి
- మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు
సినిమా కోసం కథను సిద్ధం చేసుకోవడం ఒక ఎత్తయితే, ఆ కథను అవతలివారికి చాలా తక్కువ సమయంలో చెప్పి మెప్పించడం మరో ఎత్తు. ఈ విషయాన్ని గురించే పరుచూరి గోపాలకృష్ణ .. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో ప్రస్తావించారు. "2 గంటల 30 నిమిషాల నిడివి కలిగిన ఒక సినిమా కథను 10 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టమైన కళ.
ఎందుకంటే ఏ కేరక్టర్ ను .. ఏ సీక్వెన్స్ ను .. ఏ పాయింట్ ను వదిలేస్తున్నది తెలియదు. ఎక్కడెక్కడ ట్విస్టులు మరిచిపోయామన్నది తెలియదు. అవతలవాళ్లకి నచ్చే పాయింట్ ను వదిలేశామనుకోండి .. వాళ్లకి కథ నచ్చదు. అందువలన కథలోని ముఖ్యమైన మలుపులను .. నచ్చే అంశాలను ముందుగా గుదిగుచ్చి 10 నిమిషాల్లో చెప్పేయాలి. ముందుగా రికార్డు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తరువాత వెళ్లి ఎవరికైతే చెప్పాలనుకున్నారో వాళ్లకి చెప్పండి. ఈ విధంగా చేసినట్టయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు" అని చెప్పుకొచ్చారు.