Telangana: తెలంగాణ ఎన్నికల్లో ఏదో జరిగింది.. ఓడిపోయిన వాళ్లు మాట్లాడకూడదా?: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- ఫలితాలపై మాకు అనుమానాలు ఉన్నాయి
- బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలి
- రిజర్వేషన్ ఎందుకు కాపాడుకోలేకపోయారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏదో జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో తమకు ఇంకా అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయినవారికి మాట్లాడే హక్కులేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కోర్టులకు పోలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగిన విషయాన్ని ఉత్తమ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ఎందుకు కొనసాగించలేకపోయిందని ప్రశ్నించారు. బీసీలకు వెంటనే సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు.