Tamilnadu: గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన కేసు... రక్తమిచ్చిన యువకుడి ఆత్మహత్య!

  • చికిత్స పొందుతూ కన్నుమూత
  • అంతర్గత రక్తస్రావమే కారణమన్న వైద్యులు
  • హెచ్ఐవీ ఉందని తెలియకుండానే రక్తమిచ్చిన యువకుడు

తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఘటనలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసిన రక్తదాత (19) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తనకు తెలియకుండానే తప్పు చేశానన్న మనస్తాపంతో ఆ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కొన్నిరోజుల క్రితం రామనాథపురంలోని ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం మదురై రాజాజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 'గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్' కారణంగా అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. తమ వద్దకు తీసుకువచ్చేసరికే అతని ఆరోగ్యం క్షీణించిందని, ఈ ఉదయం అంతర్గత రక్తస్రావం పెరిగి కన్నుమూశాడని డీన్ ఇన్ చార్జ్ డాక్టర్ ఎస్ షణ్ముగసుందరం తెలిపారు.

కాగా, నవంబర్ లో అతను రక్తాన్ని దానం ఇవ్వగా, శరీరంలో హెచ్ఐవీ వైరస్ ఉందన్న సంగతి అతనికి తెలియదు. ఆపై రక్త పరీక్షల్లో విషయం బయట పడగా, అప్పటికే, అతనిచ్చిన రక్తాన్ని పరీక్షించకుండానే ఓ గర్భిణికి ఎక్కించేశారు వైద్యులు. ఈ ఘటన తమిళనాట తీవ్ర కలకలం రేపింది.

  • Loading...

More Telugu News