Team India: బీరు తాగుతూ బస్సు దిగిన రవిశాస్త్రి.. వీడియో వైరల్!

  • మూడో టెస్టులో భారత్ ఘన విజయం
  • హోటల్ వద్ద భారత్ ఆర్మీ సాదర స్వాగతం
  • కామెంట్స్‌తో హోరెత్తిస్తున్న అభిమానులు
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. భారత జట్టు జయాపజయాలతో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో ఉండే రవిశాస్త్రి ఈసారి మరో రకంగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో 137 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 2-1తో ఆధిక్యంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ముందంజలో నిలిచింది. భారత జట్టు విజయం సాధించిన అనంతరం కోహ్లీ సేన బస్సులో హోటల్‌కు బయలుదేరింది.

భారత జట్టుకు అధికారికంగా మద్దతు ఇచ్చే భారత్ ఆర్మీ సభ్యులు హోటల్ వద్ద భారత జట్టుకు సాదర స్వాగతం పలికారు. బస్సు నుంచి సభ్యులు ఒక్కొక్కరుగా కిందికి దిగారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం బీరు తాగుతూ కిందికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Team India
Bharat Army
Ravi Shastri
head coach
Melbourne
Australia

More Telugu News