sensex: సంవత్సరాంతంలో ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- మెరిసిన మెటల్ స్టాకులు
- బలహీనంగా ట్రేడ్ అయిన ఎనర్జీ, ఇన్ఫ్రా, రియాల్టీ స్టాకులు
- సెన్సెక్స్ 8 పాయింట్స్ డౌన్.. నిఫ్టీ 3 పాయింట్స్ అప్
2018 సంవత్సరం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. మెటల్ స్టాకుల అండతో ప్రారంభంలో జోరుగా కొనసాగిన మార్కెట్లు... బలహీనంగా ట్రేడ్ అయిన ఎనర్జీ, ఇన్ఫ్రా, రియాల్టీ స్టాకుల ప్రభావంతో లాభాలను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు కోల్పోయి 36,068కు చేరింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 10,863కు పెరిగింది.
టాటా స్టీల్, వేదాంత, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర సంస్థలు లాభాల్లో ముగిశాయి. హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా తదితర సంస్థలు నష్టపోయాయి.