Sri Lanka: శ్రీలంక క్రికెట్‌పై ఆ దేశ క్రీడాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- అవినీతిలో శ్రీలంక క్రికెట్
- బుకీలు, అండర్ వరల్డ్‌తో సంబంధాలు
- ఐసీసీ నివేదికను చూశానన్న మంత్రి
శ్రీలంక క్రికెట్‌పై ఆ దేశ క్రీడాశాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో శ్రీలంక అంత్యంత అవినీతి దేశంగా మారిందని ఐసీసీ ఓ నివేదికను తయారుచేసిందని, దానిని తాను చూశానని తెలిపారు. దుబాయ్‌లో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అలెక్స్ మార్షల్‌తో దుబాయ్‌లో జరిగిన సమావేశం అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
శ్రీలంక క్రికెట్ పాలకమండలి కింది నుంచి పై వరకు అవినీతిలో కూరుకుపోయిందని, ఆటగాళ్ల కంటే బోర్డే అవినీతి మయంగా మారిందని ఐసీసీ అధికారులు తనతో చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్‌కు ఒక్క బుకీలతోనే కాకుండా అండర్ వరల్డ్ మాఫియాతోనూ సంబంధాలు ఉన్నాయని, చివరికి స్థానిక మ్యాచ్‌ల్లోనూ అండర్ వరల్డ్ జోక్యం చేసుకుంటున్నట్టు చెప్పారని మంత్రి వివరించారు.
దురదృష్టవశాత్తు అవినీతిలో శ్రీలంక క్రికెట్ అగ్రస్థానంలో ఉంది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ దిల్హారా లోకుహెట్టిగెపై గత నెలలో నిషేధం విధించగా, మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్య, మాజీ పేసర్ నువాన్ జోస్యలపై కేసులు ఉన్నాయి.