India: ఎన్నికల నామ సంవత్సరం... ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలివే!
- ఏప్రిల్ - మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు
- ఏపీ, ఒడిశా, జమ్ము అండ్ కశ్మీర్ ఎన్నికలు కూడా
- మహారాష్ట్ర, హర్యానాలకు అక్టోబర్ లో ఎన్నికలు
2019 సంవత్సరంలో ఇండియాలోని పలు రాష్ట్రాలతో పాటు, వచ్చే ఐదేళ్లూ దేశ పరిపాలన ఎవరి చేతుల్లో ఉంటుందో తేల్చే లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ - మే నెలల్లో లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్ము అండ్ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రెండు నెలల వ్యవధిలో ఐదు రాష్ట్రాలకు, లోక్ సభకు ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్న ఎన్నికల కమిషన్, మార్చిలో షెడ్యూల్ ను ప్రకటిస్తుందని అంచనా. ఆపై అక్టోబర్ లో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు, నవంబర్ లో జార్ఖండ్ ఎన్నికలు జరగాల్సివుంది. ఈ మూడు రాష్ట్రాలకూ ఒకేసారి షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.