sensex: కొత్త ఏడాదిని లాభాలతో ఆరంభించిన మార్కెట్లు
- చివరి సెషన్ లో లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు
- 186 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 48 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కొత్త ఏడాది తొలి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ఆరంభంలో తడబాటుకు గురైనా... చివరి సెషన్ లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో లాభాల్లోకి వెళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186 పాయింట్లు లాభపడి 36,254కు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10,910 వద్ద స్థిరపడింది.
భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంక్, ఐసీసీఐసీ బ్యాంక్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్, వేదాంత, హెచ్సీఎల్ తదితర కంపెనీలు నష్టపోయాయి.