paruchuri: జనవరి 9వ తేదీకి మరో ప్రాధాన్యత వుంది: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎన్టీఆర్ జీవితంలో మూడు దశలు వున్నాయి 
  • జనవరి 9నే 'అనురాగదేవత' విడుదలైంది 
  • ఫస్టుటైమ్ 'పరుచూరి బ్రదర్స్' టైటిల్ కార్డు  

ఎన్టీఆర్ కుటుంబంతో పరుచూరి బ్రదర్స్ కి ఎంతో అనుబంధం వుంది. ఎన్టీఆర్ .. బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు వారు కథలు .. సంభాషణలు అందించారు. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ గా రూపొందుతోన్న 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' గురించి తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

"ఎన్టీఆర్ వెండితెరపై తిరుగులేని కథానాయకుడు. రాజకీయాల్లో ఆయన మహానాయకుడు. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ కి బాలకృష్ణ .. క్రిష్ కలిసి తగిన టైటిల్స్ పెట్టారు. అందుకు వాళ్లకు నేను ధన్యవాదాలు .. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందు సాధారణమైన వ్యక్తిగా .. అసాధారణమైన కథానాయకుడిగా .. ఆ తరువాత అనితర సాధ్యమైన రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ జీవితంలో మూడు కీలకమైన దశలు కనిపిస్తాయి.

'కథానాయకుడు' సినిమాను జనవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అన్నగారు ముఖ్యమంత్రి అయిన రోజుగా జనవరి 9 ప్రపంచానికి గుర్తుంటుంది. కానీ పరుచూరి బ్రదర్స్ కి మాత్రం 'అనురాగదేవత' రిలీజ్ డేట్ గా గుర్తుంటుంది. 'పరుచూరి బ్రదర్స్' అని టైటిల్ కార్డు పడటం ఈ సినిమా నుంచే మొదలైంది"అని చెప్పుకొచ్చారు.     

  • Loading...

More Telugu News